Viral: వేశ్యతో భర్త శృంగారం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలనుకున్న భార్య.. చివర్లో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్..
తన భర్త తనను మోసం చేస్తున్నాడన్న అనుమానంతో ఓ మహిళ అతడి కదలికలపై నిఘా పెట్టింది. ఆమె అనుమానాన్ని నిజం చేస్తూ
తన భర్త తనను మోసం చేస్తున్నాడన్న అనుమానంతో ఓ మహిళ అతడి కదలికలపై నిఘా పెట్టింది. ఆమె అనుమానాన్ని నిజం చేస్తూ అతడు ఓ రోజు వ్యభిచార గృహంలోకి వెళ్లాడు. ఇక ఇదే అదునుగా చేసుకుని అతడ్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలనుకుంది భార్య. కానీ సీన్ కట్ చేస్తే కథ చివర్లో వచ్చే మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. మీ ఫ్యూజులు ఎగిరిపోయేలా చేస్తుంది. ఇంతకీ అసలేం జరిగిందంటే.?
థాయ్‌లాండ్‌కు చెందిన ఓ మహిళ తన భర్త.. మరో మహిళతో అక్రమ సంబంధంలో ఉన్నాడని అనుమానపడింది. దాన్ని రుజువు చేస్తూ ఆమెకు అతడి పర్స్‌లో ఓ లేడీస్ క్లబ్(సెక్స్ షాప్) రసీదు దొరికింది. ఆ క్లబ్ గురించి వివరాలు తెలుసుకునేందుకు సదరు మహిళ కార్డుపై ఉన్న నెంబర్‌కు ఫోన్ చేసింది. ఇక అక్కడ ఉన్న మేనేజర్ ‘మీరే వచ్చి చూడండి’ అంటూ చెప్పడంతో.. ఆమె తన భర్తను అక్కడే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని అనుకుంది.
ఇక్కడ కథలోని ట్విస్ట్ ఏంటంటే.. ఆ వేశ్య గృహానికి వెళ్లిన ఆమెకు.. అక్కడున్న మేనేజర్ ఏకంగా ఉద్యోగాన్ని ఆఫర్ చేశాడు. ఇక దానికి సదరు మహిళ కూడా అంగీకరించింది. ‘ఆ ప్లేస్‌లో ఉద్యోగం చేయాలన్నది మొదటిగా నా ఉద్దేశ్యం కాదు.. కానీ అక్కడ ఏం జరుగుతున్నాయో తెలుసుకోవాలనే ఉత్సుకత నన్ను ఆ ఆఫర్‌ను అంగీకరించేలా చేసింది’ అని ఆ మహిళ ఓ పోస్ట్ ద్వారా నెటిజన్లతో తెలిపింది. కాగా, ఇప్పటికీ నా భర్తకు తెలియకుండా ఆ షాప్‌లో ఉద్యోగాన్ని రహస్యంగా కంటిన్యూ చేస్తున్నానని ఆమె పేర్కొంది