Posts

Shriya Saran: న్యూడ్ ఫోటో షేర్ చేసి షాక్ ఇచ్చిన శ్రియా చరణ్... అందరికీ దిమ్మతిరిగి ఫ్యూజులు ఎగిరిపోయే పోస్ట్!

AAA
Please wait 0 seconds...
Scroll Down and click on Go to Link for destination
Congrats! Link is Generated

 

Shriya Saran: న్యూడ్ ఫోటో షేర్ చేసి షాక్ ఇచ్చిన శ్రియా చరణ్... అందరికీ దిమ్మతిరిగి ఫ్యూజులు ఎగిరిపోయే పోస్ట్!


ఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రియా చరణ్ ఇంస్టాగ్రామ్ వేదికగా సంచలనానికి తెరలేపారు. ఆమె ఏకంగా న్యూడ్ ఫోటో పోస్ట్ చేశారు. శ్రియా బోల్డ్ అటెంప్ట్ నెటిజెన్స్ మైండ్ బ్లాక్ చేసింది. ఇక క్రేజీ కామెంట్స్ తో రెచ్చిపోయారు.

11111111

ఒక ప్రక్క హ్యాపీ మ్యారీడ్ అనుభవిస్తూ మరో ప్రక్క చక్కగా సినిమాలు చేస్తున్నారు శ్రియా(Shriya Saran). కెరీర్ ఫేడ్ అవుట్ అవుతున్న దశలో శ్రియా తన రష్యన్ ప్రియుడు ఆండ్రూని వివాహం చేసుకున్నారు. 2018లో శ్రియా-ఆండ్రూ వివాహం నిరాడంబరంగా జరిగింది.


ఇక లాక్ డౌన్ సమయంలో గర్భం దాల్చిన శ్రియా పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది.  ఈ విషయం చాలా కాలం తర్వాత శ్రియా ఫ్యాన్స్ తో పంచుకున్నారు. శ్రియా తల్లయ్యిందన్న ఆ వార్త అందరికీ చిన్న ఝలక్ ఇచ్చింది. ఇక శ్రియా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తరచుగా తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు.



కాగా శ్రియా లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ అందరి ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసింది. ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో శ్రియా న్యూడ్ ఫోటో పంచుకున్నారు. ఓ ఆర్ట్ గ్యాలరీని సందర్శించిన శ్రియా... అక్కడ వెనక్కి తిరిగి ఉన్న అమ్మాయి న్యూడ్ పెయింటింగ్ ఉంది. ఆ పెయింటింగ్ వద్ద ఫోటో దిగి ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో శ్రియా షేర్ చేశారు.


ఆర్ట్ గ్యాలరీలో అన్ని ఫోటోలు ఉండగా నగ్నంగా ఉన్న అమ్మాయి పెయింటింగ్ పక్కన నిల్చొని ఆమె ఫోటో దిగడం ఆసక్తికరంగా మారింది. శ్రియా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఆ ఫోటో క్షణాల్లో వైరల్ గా మారింది. ఇక శ్రియా చర్యకు నెటిజెన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. ఆమెకు కొన్ని విమర్శలు ఎదురవుతున్నాయి. 



లాంగ్ కెరీర్ అనుభవించిన స్టార్ హీరోయిన్స్ లో శ్రియా ఒకరు. దశాబ్దానికి పైగా శ్రియా నార్త్ టు సౌత్ అన్ని పరిశ్రమల్లో సత్తా చాటారు. తెలుగులో రెండు జనరేషన్స్ స్టార్స్ తో నటించిన ఘనత ఆమె సొంతం. చిరు, బాలయ్య, నాగ్, వెంకీలతో పాటు మహేష్, ఎన్టీఆర్(NTR), ప్రభాస్, పవన్ (Pawan Kalyan) లతో ఆమె జతకట్టారు



కెరీర్ లో అనేక బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ నమోదు చేశారు. గొప్ప డాన్సర్ అయిన శ్రియా అప్పట్లో అబ్బాయిల కలల రాణిగా వెలిగిపోయారు. ఇప్పటికి కూడా శ్రియా జోరు తగ్గలేదు. అడపాదడపా చిత్రాలు చేస్తూనే ఉన్నారు. సీనియర్ హీరోలకు జంటగా నటిస్తున్నారు. అలాగే లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తున్నారు. 


శ్రియా ప్రధాన పాత్రలో గమనం టైటిల్ తో మూవీ విడుదలైంది. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడం విశేషం. ఇక లేటెస్ట్ ఇండియన్ బ్లాక్ బస్టర్ ఆర్ ఆర్ ఆర్ మూవీలో శ్రియా ఓ రోల్ చేశారు.ఆమె అజయ్ దేవ్ గణ్ భార్య పాత్రలో తళుక్కున మెరిశారు. 


ప్రస్తుతం హిందీ చిత్రం దృశ్యం 2లో నటిస్తున్నారు. ఇది మలయాళ హిట్ చిత్రానికి రీమేక్. అలాగే ఓ కన్నడ చిత్రంలో శ్రియా నటిస్తున్నారు. నటనపరంగా కూడా అద్భుతం చేయగల శ్రియా మరికొంత కాలం నటించాలని, అలరించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 

Post a Comment

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.