చిన్న బికినీ వేసుకున్న పెద్ద పాప... జలకాలాటలో వయస్సుకు రమ్యకృష్ణ సవాల్
కొందరికి ఏజ్ జస్ట్ నంబర్ మాత్రమే... వాళ్ళ గ్లామర్ కి వయసుకు అసలు సంబంధం ఉండదు. అలాంటి వారిలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఒకరు. రమ్యకృష్ణ వెండితెరకు పరిచయమై మూడు దశాబ్దాలు దాటిపోతుంది. ఇప్పటికీ వన్నె తరగని అందంతో ఆమె మెరిసిపోతున్నారు.
రమ్యకృష్ణ టాలీవుడ్ లో గ్లామర్ రోల్స్ చేసిన హీరోయిన్స్ లో ఒకరు. 90లలోనే బికినీ వేసిన ఘనత ఆమె సొంతం. అల్లుడా మజాకాతో పాటు మరికొన్ని చిత్రాలలో ఆమె బికినీలో కనిపించి సెగలు రేపారు.
రాఘవేంద్రరావు ఫేవరెట్ హీరోయిన్స్ లో ఒకరైన రమ్యకృష్ణను, ఆయన తన సినిమాలలో సూపర్ గ్లామరస్ గా చూపించారు. ఆమె బొడ్డుపై పూలు పళ్ళు విసిరి.. చాలా ఫేమస్ చేశాడు.
టాప్ స్టార్ గా రెండు దశాబ్దాలకు పైగా ఉన్న రమ్యకృష్ణ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయ్యారు. పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు.
భర్త కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ చిత్రంతో లో ప్రకాష్ రాజ్ భార్యగా కీలక రోల్ చేస్తున్న ఆమె.. విజయ్ దేవరకొండ-పూరి పాన్ ఇండియా మూవీ లైగర్ లో మరో రోల్ చేస్తున్నారు.
ఇక రమ్యకృష్ణ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు. తన లేటెస్ట్ ఫోటోలు, మనోభావాలు పంచుకుంటూ ఉంటారు.