హైదరాబాద్: చెప్పినట్లు చెయ్.! లేదంటే ఆ ఫోటోలు కాబోయే భర్తకు పంపుతా…
కలిసి తిరిగన సమయంలో ఫోటోలు తీసుకున్నాడు. అవసరం తీరాక ఆమెను పక్కనపెట్టాడు. తనను పెళ్లి చేసుకోవాలని యువతి ఒత్తిడి తేగా వదిలించుకునే ప్రయత్నం చేశాడు. ఇక లాభం లేదని తాను మోస పోయానని గ్రహించిన యువతి ఇంట్లో వాళ్లు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకుంది. తల్లిదండ్రులు చూసిన అబ్బాయితో నిశ్చితార్థం కూడా చేసుంకుంది. ఇంతలో ఆమె జీవితంలోవి విలన్‌లా అతగాడు మళ్లీ వచ్చాడు. సరదగా తనతో పాటు దిగిన ఫోటోలు కాబోయేవాడికి పంపిస్తానని బ్లా్క్ మెయిల్ చేయటం ప్రారంభించాడు. అతడి వేధింపులు తట్టుకోలేని యువతి పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెలితే: హైదరాబాద్ అమీర్ పేటకు చెందిన నాగ అభినయ్ అనే వ్యక్తికి మధురా నగర్‌లో ఉండే యువతితో పరిచయం ఏర్పడింది. కొద్ది కాలంలోనే వారి పరిచయం ప్రేమగా మారింది.
ఈ క్రమంలో ఇద్దరు సన్నిహితంగా మెలిగారు పెళ్లి చేసుకుంటానని చెప్పటంతో సదరు యువతి అతడితో సినిమాలు, షికార్లకు వెళ్లింది. కొన్నాళ్లు గడిచాక నాగ అభినయ్ యువతిని దూరం పెట్టడం మెుదలు పెట్టాడు. అతడి గురించి యువతి ఆరా తీయగా మరో యువతితో సన్నిహితంగా ఉంటున్నట్లు తెలిసింది. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని యువతి నాగ అభినయ్‌పై ఒత్తిడి తెచ్చింది. అందుకు అతడు నిరాకరించాడు. పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పాడు దీంతో మోసపోయానని గ్రహించిన యువతి ఇంట్లో పెద్దలు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకుంది. తల్లిదండ్రులు చూసిన అబ్బాయితో నిశ్చితార్థం కూడా అయింది. త్వరలోనే వీరి పెళ్లికి ముహూర్తం కూడా పెట్టారు ఇక గతాన్ని మరిచిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని యువతి భావించింది. ఇంతలోనే విలన్‌లా అతడు ఆమె జీవితంలోకి మళ్లీ ఎంట్రీ అయ్యాడు. తాను చెప్పినట్లు చెయ్యకపోతే తన వద్ద ఉన్న ఫోటోలు కాబోయే భర్తకు పంపిస్తానని బ్లాక్ మెయిల్ చేయటం ప్రారంభించాడు. తన జీవితంలోకి రావొద్దని యువతి వేడుకున్నా అతగాడు వినలేదు. ఇంకా వేధింపులు ఎక్కువ చేశాడు. దీంతో విసిగిపోయిన యువతి ఎస్సా నగర్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.