మేనమామతో పెళ్లి.. ఆ రోజు బెడ్ రూంలో భార్యను అలా చూసి!
ఆ దంపతులకు పెళ్లై ఎనిమిది సంవత్సరాలు అవుతోంది. వరసకు మేనమామ అయ్యే వ్యక్తినే ఆమె పెళ్లి చేసుకుంది. వారి ప్రేమకు మూడేళ్ల కూతురుకూడా ఉంది. సంసారం అన్నాక చిన్న చిన్న గొడవలు జరగడం సహజం. అలాగే వీరి కాపురంలోకూడా అప్పుడప్పుడు గొడవలు జరిగాయి. దాంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు తెలత్తాయి. కొన్ని రోజుల నుంచి వారి మధ్య మాటలు అంతంత మాత్రంగానే నడుస్తున్నాయి. ఈక్రమంలోనే పెద్దలు ఇద్దరిని పిలిచి సర్దిచెప్పారు. అయినప్పటికీ భర్త తీరు మారకపోవడంతో ఆ వివాహిత ఓ నిర్ణయం తీసుకుంది. సంచలనం సృష్టించిన ఈ సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రావణి-దుర్గాప్రసాద్ లు భార్యభర్తలు. వీరికి ఎనిమిది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. దుర్గాప్రసాద్ వరసకు శ్రావణి(26)కు మేనమామ అవుతాడు. వీరికి మూడు సంవత్సరాల వయసున్న ఉన్న కూతురు కూడా ఉంది. ఇక వీరు అనంతపురంలోని 5వ రోడ్డులో నివాసం ఉంటున్నారు. గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవల గురించి శ్రావణి తన తల్లితో పలు మార్లు చెబుతూ వచ్చింది. అయితే సంసారం అన్నాక చిన్నచిన్న గొడవలు సహజమే అని తల్లి అక్కమ్మ సర్ది చెబుతూ వచ్చింది. ఈ క్రమంలోనే గురువారం మరోసారి ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఎన్ని సార్లు చెప్పినా దుర్గాప్రసాద్ తీరు మారడం లేదని భావించిన శ్రావణి.. దారుణ నిర్ణయం తీసుకుంది.
ఇక గొడవ జరిగిన అనంతరం గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. ఎంతసేపు కావచ్చినా తలుపులు తీయకపోవడంతో.. అనుమానించిన స్థానికులు తలుపులు బద్దలు కొట్టారు. అక్కడ కనిపించిన దృశ్యంతో ఒక్కసారిగా షాక్ కు గురైయ్యారు. శ్రావణి ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని తల్లి అక్కమ్మకు, శ్రావణి సోదరుడు రాధాకృష్ణకు తెలియపరిచారు. దాంతో అక్కడికి చేరుకున్న వారు శ్రావణి మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరు అయ్యారు. మూడు సంవత్సరాల కుమార్తె తల్లి మృతదేహాంపై పడి ఏడుస్తుంటే.. చూపరులు కన్నీరు పెట్టుకున్నారు. అక్కమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మూడో పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.